19 May, 2026 | 1:44 AM

ఆకట్టుకున్న నిత్యశ్రీ నృత్య ప్రదర్శన

19-05-2026 12:36 AM

ఆదర్శ కళా నిలయం ఆధ్వర్యంలో అన్నమాచార్య 618వ జయంతి

తెలంగాణ సారస్వత పరిషత్‌లో నిర్వహణ

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): తెలంగాణ సారస్వత పరిషత్‌లో ఆదర్శ కళా నిలయం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 618వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత, సాహిత్య, నృత్య కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబా ద్‌కు చెందిన శ్రీ వశిష్ఠ నృత్య కళా భారతి విద్యార్థిని కుమారి నిత్యశ్రీ అందించిన కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రముఖ నాట్య గురువుకే దశరథ్ శిక్షణలో ఆమె అన్నమయ్య సంకీర్తనలకు అనుగుణంగా ప్రదర్శించిన భావప్రధాన నృత్యం సభికుల ప్రశంసలు అందుకుంది. చిన్న వయసులోనే నృత్యంలో ప్రతిభ కనబరిచిన నిత్యశ్రీ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు కళాభిమానులు అభినందించారు. ఆమె అభినయం, నాట్య కదలికలు, భావ వ్యక్తీకరణ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పలువురు కళాకారులు భక్తి సంగీతం, సాం ప్రదాయ నృత్య ప్రదర్శనలతో అలరించారు. తెలుగు సంస్కృతి, సాహిత్య సంప దను భావితరాలకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.