19 May, 2026 | 1:39 AM

కార్మికుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది

19-05-2026 12:35 AM

 మంత్రి జి.వివేక్ 

ముషీరాబాద్, మే18 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో భాగ మైన కార్మిక సంఘాలను, కార్మికుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుందని, జలమండలి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టియుసీ సత్తా చాటా లని మంత్రి జి.వివేక్‌వెంకట్‌స్వా మి పేర్కొన్నారు.

జలమండలి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరపాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోకలసి ఐఎన్‌టియుసి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు  మొగుళ్ళ రాజి రెడ్డి,  ఐఎన్‌టియుసి రాష్ట్ర సలహాదారు బొంతు రాంమోహన్ జల మండలి కార్మిక సంఘాల గుర్తిం పు ఎన్నికలు జరపాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి జి. వివేక్‌ను మంత్రి పొన్నంతో కలిసి సోమాజిగూడలోని ఆయన నివాసంలో కలిసి సత్కరించి కృతజ్ఞత లు తెలిపారు.