28 July, 2026 | 1:30 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

అమ్మకానికి రెండు తలల పాములు

19-05-2026 12:36 AM

నిందితుడిని పట్టుకున్న డీఆర్‌ఐ అధికారులు

వరంగల్, మే 18 (విజయక్రాంతి): అరుదైన రెండు తలల పాములను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని వరంగల్ నగరంలోని ఏనుమాములలో డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) ప్రత్యేక బృందం సోమవారం అదుపులోకి తీసుకుంది. అతని వద్ద రెండు పాములను స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీ య సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు సదరు వ్యక్తిని తనిఖీ చేయగా ఆయన చేతి సంచిలో రెండు పాములు సజీవంగా ఉన్నవి లభ్యమయ్యాయి. వరంగల్  అటవీ శాఖ అధికారులకు పాములను అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు. రెండు తలల పాములను పట్టి విక్రయిస్తే పెద్ద మొత్తంలో డబ్బు దక్కుతుందని ప్రచారం చాలా కాలంగా ఉంది. ఈ క్రమం లో ఈ సంఘటన వరంగల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.