27 March, 2026 | 3:46 AM

నిషిత డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ సేవలు

27-03-2026 01:59 AM

నందిపేట, పలుగుగుట్టలో ప్రత్యేక వేసవి శిబిరం

నిజామాబాద్, మార్చి 26(విజయక్రాం తి): నిషిత డిగ్రీ కళాశాల, నిజామాబాద్, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నందిపేట, పలుగుగుట్ట గ్రామాల్లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు వారం రోజుల పాటు వేసవికాల ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు.  కళాశాల చైర్మన్ సీ నిఖిల్, కోఆర్డినేటర్ సీ రాజా, డైరెక్టర్ ఓం శేఖ్, ప్రో గ్రామ్ ఆఫీసర్ ఎం.కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్ స్వప్న, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ అపర్ణ, రాములు మహరాజ్,  సర్పంచ్ సిలిండర్ లింగం, వార్డు మెంబర్లు, అధ్యాపక బృందం, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. 

చైర్మన్ సీ నిఖిల్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజ సే వను అలవర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులందరూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలన్నారు. సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ తమ గ్రామంలో సేవ లు చేయడం సంతోషంగా ఉందన్నారు.