వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
27-03-2026 01:58 AM
కనగర్తి గ్రామంలో విషాదం
కోనరావుపేట, మార్చి 26 (విజయక్రాంతి) : కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులి రవి (38) గురువారం ఉపాధి హామీ పనులు చేస్తున్న సమయంలో తీవ్ర వడదెబ్బకు గురయ్యాడు. సహచర కార్మికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడు.
మృతుడు రవికి భార్య నిర్మల, ఒక చిన్న పా ప ఉన్నారు. కాగా, ఆరు నెలల క్రితం వారి కూతురు మృతి చెందడంతో కుటుంబం ఇప్పటికే విషాదంలో ఉండగా, ఇప్పుడు రవి మరణంతో ఆ కుటుంబం మరింత దుఃఖం లో మునిగిపోయింది. బాధిత కుటుం బానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిం చాలని గ్రామసులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.




