22 March, 2026 | 7:45 PM

గేట్ లో నిర్మల్ విద్యార్థి ప్రతిభ

22-03-2026 04:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని కొత్త పోచంపాడ్ గ్రామానికి చెందిన (శ్రీనగర్) చింతల సంగీత–రవీందర్ దంపతుల కుమారుడు చింతల సంజయ్ ఇటీవల వెల్లడైన ఆల్ ఇండియా గేట్ (GATE) సివిల్ ఇంజనీరింగ్ ఫలితాల్లో 432 స్కోర్ సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం శ్రీనగర్‌లోని ఆయన నివాసంలో రవీందర్ మిత్రులు సంజయ్‌ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సంజయ్ కృషి, పట్టుదల, నియమం విజయానికి కారణమని పలువురు అభినందించారు. గ్రామ యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. సంజయ్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకతతోనే ఈ ఫలితం సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత చదువులు అభ్యసించి దేశానికి ఉపయోగపడే ఇంజనీర్‌గా ఎదగాలని తన లక్ష్యమని చెప్పారు.