2 July, 2026 | 2:32 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

ఎన్‌ఎఫ్‌సీ కాంట్రాక్టు కార్మికురాలు ఆత్మహత్య

21-03-2026 12:00 AM

కుషాయిగూడ మార్చి 20 (విజయ క్రాంతి) : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, కాప్రా గాంధీనగర్ ప్రాంతానికి చెందిన గడ్డం కృష్ణ (37), ఎన్‌ఎఫ్సీ కాంట్రాక్ట్ ఉద్యోగి, తన ఇంటిలోని ఒక సింగిల్ రూమ్ను తన్నీరు వరలక్ష్మి (25)కు అద్దెకు ఇచ్చాడు. ఆమె గత మూడు సంవత్సరాలుగా తన తల్లి, తమ్ముడితో కలిసి అక్కడ నివసిస్తోంది.

నాలుగు రోజుల క్రితం సుజాత (26) అనే మరో మహిళ కూడా వారితో కలిసి అదే గదిలో నివసించడం ప్రారంభించింది. వరలక్ష్మి, సుజాత ఇద్దరూ ఏఎస్రావు నగర్లోని మ్యాక్స్ షోరూమ్లో కలిసి పనిచేస్తున్నారు. వారం క్రితం వరలక్ష్మి తల్లి, తమ్ముడు స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం. మార్చి 19, 2026 ఉదయం సుమా రు 10:30 గంటలకు వరలక్ష్మి పనికి వెళ్లగా, సుజాత గదిలో ఒంటరిగా ఉంది.

మధ్యాహ్న సమయంలో వరలక్ష్మి ఫోన్ చేసినా స్పందన రాలేదు. రాత్రి సుమారు 10:30 గంటలకు గదికి తిరిగి వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో కిటికీ ద్వారా లోపల చూడగా, సుజాత ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.