21 March, 2026 | 3:13 AM

‘ఇందిరమ్మ’ పేరుతో ఇసుక అక్రమ రవాణా

21-03-2026 12:00 AM

రెవెన్యూ పోలీస్ శాఖలకు మామూళ్లు?

దర్జాగా పల్లెల నుంచి పట్టణాలకు..

ప్రశ్నిస్తే దాడులు.. బెదిరింపులు..

అంతా ’పెద్దాయన’ అనుచరులమంటూ బుకాయింపు 

జడ్చర్ల, మార్చి 20 : నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా దర్జాగా కొనసాగుతున్నది. ట్రాక్టర్లు బెంజి టిప్పర్ల ద్వారా పల్లెల నుంచి పట్టణాలకు తరలిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పేరుతో ఇసుకను దోచే స్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.. ఒ క్క ట్రాక్టర్ ఇసుకకు అనుమతి తీసుకుంటే పదుల సంఖ్యలో అక్రమ రవాణా చేస్తున్నా రు. ఇంత జరుగుతున్న రెవెన్యూ పోలీస్ అధికారులకు తెలియదా అంటే.. వారికి ఇచ్చే మామూళ్లు షరా మామూలే అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి..

అడ్డుకుంటే బెదిరింపులు..

జడ్చర్ల మండలంలోని గంగాపూర్ కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నాడు. స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరించడం దాడు లకు తెగించడంతో దిక్కుతోచని స్థితిలో ఉం డిపోతున్నారు. అయితే కొందరు యువ నా యకులు ఏకంగా సమంతా ఎమ్మెల్యేల మ నుషులం అంటూ చెప్పుకొని ’సందట్లో సడే మియా ’ ల తమ పనులను చక్కబెట్టుకుంటున్నట్లు సమాచారం. ఇస్కాక్రమ రవాణా పై పోలీసులను ప్రశ్నించగా తమ నోటీసుకు వస్తే కేసులు నమోదు చేస్తాం అని చెబుతున్నారు తప్ప వందల సంఖ్యలో టిప్పర్లలో ఇసుక తరలుతున్నా ఫిర్యాదులు రావడం లేదా వచ్చిన కేసులు చేయడం లేదా అనే ప్ర శ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల అండదండలతోనే అక్రమ ఇసుక రవాణా దర్జాగా సా గుతున్నట్లు బాహాటంగానే విమర్శలు గుప్పుమంటున్నాయి.

- అర్ధరాత్రి అడ్డు అదుపు లేకుండా ఇసుక రవాణా 

 ప్రకృతి విధ్వంసం జరగకుండా ప్రభుత్వము ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేసి అధి కారులను ఉంచి నిఘా ఉండాలని ఆదేశించినప్పటికీ నిబంధనలు చెబుతున్నప్పటికీ అవి మావి కావునట్టు కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏమి జరిగినా ప త్రికల్లో వచ్చిన అప్పటికి అప్పుడు ఏదో ఒక చిన్న చర్యలు తీసుకున్నట్టు వ్యవహరించి త ర్వాత ఇదంతా మామూలే అనే విధంగా అక్రమ ఇసుక రవాణా దర్జాగా జరుగుతుం ది. స్థానికులు కొంతమంది అడ్డు చెబుతున్నప్పటికీ వారిని సైతం బెదిరింపులకు పాల్ప డుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికైనా అధికా ర యంత్రం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంతోపాటు నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల కు ఇసుక సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇందిరమ్మ ఇంటికి ఇసుక అని చెబుతూ ఆ ఇంటికి చేరకుండానే మధ్యలోనే ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుందని స్థానికులు చెబుతున్న మాట. అర్ధరాత్రి వాగుల్లో ఇసుక వ్యాపారులు తెగ బిజీగా దర్శనమిస్తూ వారి వ్యాపారాన్ని మ రింత విస్తరించేలా కొనసాగిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికార యంత్రం ప్రత్యేక చర్యలు తీసుకొని అవసరమైన వారికి నియమ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్న మాట.