09-02-2026 12:00:00 AM
మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
నూతనకల్, ఫిబ్రవరి 8: గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో, చురకంటి సుమతి పవన్ రెడ్డి సౌజన్యంతో, హైదరాబాద్ శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ శంకరా కంటి ఆస్పత్రి ద్వారా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 133 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 42 మందిని ఆపరేషన్ల కోసం ఎంపిక చేశామని, వారికి ఉచిత మందులు మరియు ఉచిత రవాణా సౌకర్యం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్, ఉపసర్పంచి నాగం సరిత సుధీర్ రెడ్డి, నాయకులు కాపు రవికుమార్, పసుల అశోక్ కుమార్, వైద్య సిబ్బంది, అక్షర ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.