9 May, 2026 | 6:46 PM

సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి

09-05-2026 04:52 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం లో శనివారం  జాతీయ పక్షి నెమలి  మృతి చెంది ఉండటం  స్థానికులు చూసి పెద్దపెల్లి బీట్ ఆఫీసర్ కు సమాచారం అందించారు, అడవులలో ఉండాల్సిన  నెమలి సుల్తానాబాద్ నుండి కరీంనగర్ కు వెళ్లే రాజీవ్ రహదారి పక్కన ఇండ్ల వద్ద పడి ఉంది. ఎండ వేడిని తట్టుకోలేక మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు, పెద్దపల్లి బిట్ ఆఫీసర్ రామ్మూర్తికి  సమాచారం ఇవ్వగా , సంఘటన స్థలానికి చేరుకున్న బిట్ ఆఫీసర్ నెమలిని చూసి  అనారోగ్యం తో మృతి చెంది ఉంటుందని తెలిపారు, డాక్టర్ వద్దకు తీసుకువెళ్లి చూపించడం జరుగుతుందని తెలిపారు,