27 May, 2026 | 3:23 AM

ఎస్సీ కాలనీలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

27-05-2026 01:41 AM

జుక్కల్, మే 26 (విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ బస్టాండ్ దగ్గరలోని 15. కె.వి. డి టి ఆర్ (ట్రాన్స్ఫార్మర్) కాలిపోయిందని గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ తెలిపారు.

బస్వాపూర్ గ్రామ లైన్ మాన్. కె. మారుతి తెలియపరచి కొత్త 15 కె.వి. డి టి ఆర్. ట్రాన్స్ఫార్మర్ తెప్పించుకొని చీకటి అయిన సరే రాత్రి 8 గంటలకు విద్యుత్ సిబ్బందికి పిలిపించుకొని గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ దగ్గర ఉండి చేయించడం జరిగింది. వీరితో పాటు కారోబరి ఎం. గంగారం, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ బి.రాజు, గోపాలమిత్ర వాలంటరీ రాములు, గ్రామ విద్యుత్ వర్కర్  ముంగేవార్ దత్త రెడ్డి తదితరులు పాల్గొన్నారు.