27 May, 2026 | 4:28 AM

తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి

27-05-2026 01:42 AM

మొయినాబాద్, మే 26 (విజయక్రాంతి): మొయినాబాద్ మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ సంపూర్ణ రాములు ఆధ్వర్యంలో రెండోసారి బోర్ వేయించారు. గ్రామ ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ బోర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సర్పంచ్ సంపూర్ణ రాములు తీసుకున్న చర్యలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. గ్రామంలో తాగునీటి సమస్యలు లేకుండా అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి పనిచేస్తామని సర్పంచ్ తెలిపారు.