27 May, 2026 | 2:24 AM

జిలుగు విత్తనాల పంపిణీ

27-05-2026 01:38 AM

గాంధారి, మే 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో డిసిసిబి, ఐడిసిఎంఎస్ డైరెక్టర్ గాంధారి చైర్మన్ పెద్దబూరి సాయికుమార్ ఆధ్వర్యంలో రైతులకు జిలుగు విత్తనాల పంపిణీ ప్రారంబించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని రైతులకు 250 బస్తాల జిలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కావాల్సిన రైతులు బస్తా ధర రూ.2435 చెల్లించి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్, సొసైటీ వైస్ చైర్మన్ ఉదల్ సింగ్, వ్యవసాయ అధికారి రాజలింగం, సొసైటీ కార్యదర్శి గాండ్ల సాయిలు, డైరెక్టర్ లు గాండ్ల లక్ష్మణ్, దోల్లు సాయిలు, గొల్ల హర్జయ్య, గోవింద్ గణపతి, శివాజీ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.