16-02-2026 12:00:00 AM
పాల్గొన్న ముషీరాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ
ముషీరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లోని శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం వద్ద దాతల సహకారంతో రూ. 8 లక్షలతో నూతనంగా నిర్మించిన షెడ్డును ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్య సభ సభ్యులు ఎం. అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు షెడ్డు ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ. వినయ్ కుమార్, ఆలయ ఈఓ లక్ష్మా రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మరిశెట్టి నర్సింగ్ డివిజన్ బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, సురేష్ రాజు, ఆనంద్ రావు, సాయి గౌడ్, ప్రశాంత్, ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.