calender_icon.png 16 February, 2026 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచంలోనే తొలి ఏఐ మహాశివరాత్రి డిజిటల్ నాద యజ్ఞం

16-02-2026 12:00:00 AM

50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగుశివ భక్తి గీతాల సృష్టి

సాంకేతికత  సమూహ ఆధ్యాత్మికతల కలయికలో కొత్త మైలురాయి

హైదరాబాద్, ఫిబ్రవరి 15 : ఆధ్యాత్మికతకు సాంకేతికతను జోడిస్తూ ప్రపంచంలోనే తొలి ఏఐ మహాశివరాత్రి  డిజిటల్ నాద యజ్ఞం కార్యక్రమం ఘనవిజయాన్ని సాధించింది.  సూపర్ ఏఐ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహత్తర డిజిటల్ భక్తి యజ్ఞంలో ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా మంది ఒకే వేదికపై చేరి కేవలం 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలను సృష్టించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమం ఆన్లైన్ వేదికైన జూమ్ ద్వారా నిర్వహించబడింది.

గీతాల సాహిత్య రూపకల్పన కోసం చాట్ జీపీటీ, చాట్ జీపీటీ కాస్టమ్ జీపీటీ వినియోగించగా, సంగీత నిర్మాణానికి ఏఐ ఆధారిత సంగీత సాధనాలు ఉపయోగించారు. మహాశివరాత్రి పర్వదినాన పరమశివునికి సమూహ నాదార్పణగా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు అంకితం చేశారు. డిజిటల్ నాద యజ్ఞంలో పాల్గొనేవారు శివుని విభిన్న రూపాలైన శివ, రుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, లింగ రూపా లు, శివ తాండవం వంటి భావాలతో గీతాలను సృష్టించారు. అన్ని గీతాలు తెలుగు లోనే రూపొందడం ప్రత్యేకతగా నిలిచింది.

108 గీతాల ప్రత్యేక ప్రసారం

సృష్టించిన 5,700కు పైగా గీతాల నుంచి ఎంపిక చేసిన 108 భక్తి గీతాలను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 1 గంటల వరకు మూడు గంటల ప్రత్యేక జూమ్ ప్రసారంలో వినిపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రసారం పవిత్ర నాదార్పణగా, సమూహ భక్తి అనుభూతిగా రూపు దిద్దుకుంది. ఈ కార్యక్రమానికి ఇంపాక్ట్ సహకారం అందించింగా డిస్టిక్ట్  గంపా నాగేశ్వర్ రావు నాయకత్వం వహించగా, ట్రెజరర్ గంపా ఆదిత్య భారత్ మద్దతు తెలిపారు.

సూపర్ ఎఐ అకాడమీ కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయ శ్రీ తదితరులు సాంకేతిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.  సూపర్ ఏఐ అకాడమీ  వ్యవస్థాపకులు నిఖీలు మాట్లాడుతూ.. సంప్రదాయాన్ని భర్తీ చేయడం కాకుండా మానవ సంకల్పాన్ని విస్తరించడమే ఏఐ లక్ష్యమని తెలిపారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందర్భాల్లో కృత్రి మ మేధస్సు వినియోగం ద్వారా కొత్త అవకాశాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. ప్రపం చవ్యాప్తంగా పాల్గొనేవారికి నమోదు వివరాలకు AIMahashivaratri. com అనే ప్రత్యేక వ్బుసైట్ను ఏర్పాటు చేశారు.