పుల్లూరులో మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ఏర్పాటు
ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా అశోక్ ఎన్నిక
సిద్దిపేట రూరల్, మే 25: పుల్లూరు గ్రామ మున్నూరుకాపు సంఘానికి నూతన కమి టీని సోమవారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా అశోక్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా నక్క రాజేందర్, కోశాధికారిగా ఒగ్గు లచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా దేశెట్టి బాలరాజు, కార్యదర్శిగా ఎల్లయ్యగారి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సంఘ సభ్యులు, పెద్దలు, యువత పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన అశోక్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధి, సామాజిక ఐక్యత, యువత భాగస్వామ్యంతో మున్నూరుకాపు సమాజాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు. సమాజానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో సభ్యులందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అశోక్ నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని సంఘ పెద్దలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యువత, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.






