ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
వెంకటాపూర్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి విశేష కృషి చేశారని,
యువతకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు దేశంలో సాంకేతిక రంగానికి బలమైన పునాది వేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామప్ప ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఐలయ్య, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కోటి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు జాకీర్, జిల్లా ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజిరెడ్డి, సర్పంచులు పోషాలు, రవి, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, వార్డు సభ్యులు కోటి, ప్రమోద్, నాయకులు వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






