21 August, 2026 | 1:49 AM

నర్మెట్టలో ఆర్‌ఏయంపీ అవగాహన సదస్సు

21-08-2026 01:13 AM

జనగామ, ఆగస్టు 20 (విజయక్రాంతి): నర్మెట్ట మండల కేంద్రంలో ని - ఎం ఎస్ ఎం ఈ  ఆధ్వర్యంలో ఆర్ ఎ యం పి  కింద అవగాహన సదస్సు జరిగింది. పంట వ్యర్థాల నిర్వహణ, బయోచార్ తయారీలో ఉన్న వ్యాపార అవకాశాలపై ఈ సదస్సు నిర్వహించారు.

రైతులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు హాజరయ్యారు. ఈ సదస్సుకు భార్గవి మండాడి, శ్రవణ్, సర్పంచ్ శ్రీధర్ గౌడ్ హాజరయ్యారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ అభివృద్ధిలో చిన్న పరిశ్రమల పాత్రను వివరించారు. చెత్త నుండి సంపద సృష్టించే అవకాశాలు నర్మెట్టలో ఉన్నాయని, యువతకు, మహిళలకు ఉపాధి కల్పనకు సహకరిస్తానని తెలిపారు.