13 April, 2026 | 4:18 AM

కొత్త ఆశలు

13-04-2026 12:53 AM

రోజూ వెళ్లే తోవే

అవే మలుపులు

అదే మనసులు

మెదలాడే ఊసులు

కదలాడే నవ్వులే కొత్తవి !

           ******

రోజూ చూసేవే

అవే చెట్లు, అవే గట్లు

దారి పొడుగునా

వికసించే పువ్వులు

చిగురించే కొమ్మలే కొత్తవి !

           ******

బతుకు తీరం అదే

బాదరబందీలు అవే

నడిచిన పాదాల వెంట

జల్లుకున్న నవ్వులు

ఏరుకున్న ఆశలే కొత్తవి !

 వినోద్ కుత్తుం