23 August, 2026 | 12:26 AM

కోటగుళ్లకు కొత్త శోభ

23-08-2026 12:03 AM

శతాబ్దాల చరిత్రకు, కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం కాకతీయుల కోటగుళ్లు నూతన శోభను సంతరించు కోనున్నాయి. 12వ శతాబ్దంలో నిర్మించిన 22 ఆలయాల సమాహారమైన ఈ చారిత్రక కట్టడం.. రాతితో చెక్కిన శిల్పకళా సౌందర్యం, అపురూప నిర్మాణశైలి. ఆధ్యాత్మిక ప్రాశస్త్యంతో నేటికీ భక్తులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది.గణపురం ప్రాంతానికి మణిహారంగా నిలుస్తూ, కాకతీయ కళా వైభవాన్ని తరతరాలుగా చాటి చెబుతోన్న ఈ ప్రాంతం..‘కోటి లింగాల స్వర్గం’గానూ పేరు గడించింది. శైవ మత కేంద్రంగా ప్రసిద్ధిగాంచినప్పటికీ సమాజ ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది. ప్రపంచ పర్యాటక సంస్థ (డబ్ల్యూటీఓ) ద్వారా హెరిటేజ్ స్థలంగా గుర్తింపు పొందిన కోటగుళ్లు.. మరింత ఆకర్షణీయంగా మారనున్నాయి.‘సాస్కి ప్రసాద్’ పథకంలో కోటి రూపాయలతో కోటగుళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇది కరెక్టేనా

ఆలయం గణపురం గ్రామానికి ఈ శాన్య దిశలో ఉన్న మట్టికోటలో ఉండటం వల్ల కోటగుళ్లు అని పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1199 - మధ్య కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవ చక్రవర్తి, 1234లో ఈ ఆలయాల సముదాయాన్ని నిర్మించారు. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడు గణపతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. కాకతీయులు శైవ మతాభిమానులు అయినప్పటికీ, వైష్ణవ మతానికి కేశవ భేదం చూపకుండా ఆలయాలను నిర్మించడం ప్రత్యేకత. వీటి చుట్టూ రాతి గోడలతో ప్రాకారం నిర్మించబడి, దాని చుట్టూ 24 ప్రాకారపు ఆలయాలు కుడివైపు నాట్య మండపం, ఎడమ వైపు కాటేశ్వరాలయం ప్రధానాలయం, గణపేశ్వరాలయం ఉన్నాయి.

ట్రిపుల్ టీ విధానంలో రూపకల్పన

కాకతీయ నిర్మాణ శైలికి మచ్చుతునకలుగా భావిస్తున్న కోటగుళ్లు, ’ట్రిపుల్ టీ’ అనగా టౌన్, టెంపుల్ ట్యాంక్, విధానం లో రూపొందించబడ్డాయి. గణపురం నగరం, గణపేశ్వరాలయం, గణపసముద్రం (పెద్ద చెరువు)లతో కూడిన ఈ సముదాయం, సామంత రాజ్యకేంద్రంగా రూపొందింది. ప్రధాన ఆలయంలో సర్పధారియై డమరుకాన్ని వాయిస్తున్న పరమశివుని నిలువెత్తు విగ్రహం, దీర్ఘాకృతి శివలింగం (నక్షత్రకార పానఘట్టంపై కొలువై ఉంది) ప్రధాన ఆకర్షణలు, ఆలయ గోడలపై చండిక, త్రిముఖ బ్రహ్మ, పంచముఖ గరుత్మంతుడు, నందీశ్వరుడు, గిరిజా కళ్యాణం వంటి శిల్పాలు అబ్బురపరుస్తాయి.

సాంస్కృతిక వైభవం 

చరిత్రలో ఈ ఆలయం కేవలం పుణ్యక్షేత్రమే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా మొదటి ఆస్థానంగా ఉండేది. గణప తి దేవుడు 60 ఎకరాల మాగాణి భూమిని దానంగా ఇచ్చి, దాని ఆదాయంతో ధూపదీప నైవేద్యాలు, అంగరంగ భోగాలు నిర్వహించేవారు.72 మంది సేవకులు, 16 మంది వాయిద్యకారులతో ప్రతీరోజు నాట్య ప్రదర్శనలు, సంకీర్తనలు జరిగేవి. దక్షిణ వైపు 60 స్తంభాలతో రంగ మంటపం ఉండేది, అక్కడ వివిధ సాంస్కృతిక, విజ్ఞాన, సంగీత, సాహిత్య కార్యక్రమాలు జరిగేవి. అయితే, పూర్వకాలంలో గుప్త నిధుల కోసం కొందరు ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం క్షీణించిన స్థితిలో ఉన్నప్పటికీ, రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటలతో పోల్చదగ్గ శిల్ప సౌందర్యం కలిగి ఉంది.

దేశ, విదేశాల నుంచి పర్యాటకులు

గత 20 సంవత్సరాలుగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి నిత్య దూప దీ ప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కోట గుళ్లు పుణ్యక్షేత్రంగా, పర్యాటక ఆకర్షణగా మారింది. సోమ, శుక్రవారాల్లో గణపతి, సందీశ్వర పూజలు, అభిషేకాలు, మహా మంగళహార తి ఘనంగా నిర్వహిస్తారు. కార్తీకమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో లక్షలాది భక్తులు కోటగుళ్లను సందర్శిస్తారు. రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధి లో భాగంగా గర్భాలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తున్న క్రమంలో బయటపడిన పది అడుగుల భారీ శివ ద్వార పాలక విగ్రహాలు ఆలయానికి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి.  

ప్రసాద్ పథకంలో అభివృద్ధి  

వరంగల్ నుంచి సుమారు 65 కి.మీ. దూరంలో ఉన్న కోటగుళ్లు.. భద్రకాళి దేవస్థానం, ఓరుగల్లు కోట వంటి ప్రదేశాలతో కలిసి పర్యాటక పొదరిల్లుగా ప్రసిద్ధిచెందాయి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కోటగుళ్లను అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సాస్కి, ప్రసాద్ పథకంలో మొదటి విడత రూ.కోటి మంజూరు చేసింది. ప్రస్తుతం పార్కింగ్, రోడ్డు నిర్మాణం, లైటింగ్ పనులు కొనసాగుతుంది.

 నాగపురి శ్రీనివాస్‌గౌడ్, విజయక్రాంతి, భూపాలపల్లి