నిరంతరంగా విద్యుత్ సరఫరా
03-07-2026 06:41 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు వానాకాలం సీజన్ నేపథ్యంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు డివిజన్ అధికారి నాగరాజు తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఎల్ల పెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద చేపడుతున్న విద్యుత్ పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ చర్య తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు కూడా వానాకాలం నేపథ్యంలో విద్యుత్ సప్లై ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని ఏదైనా సంఘటన జరిగినప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. లూజ్ ఫుల్ అంతరాయం కలిగించే ప్రదేశాల్లో మరమత్తు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఏ డి ఏ కే. శ్రీనివాసరావు విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు.






