3 July, 2026 | 7:30 PM

అంగన్వాడి కేంద్రం పరిసరాల్లో పాము కలకలం

03-07-2026 06:50 PM

* భయంతో పరుగులు తీసిన చిన్నారులు..

తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): భీంపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం-2 లో శుక్రవారం పాము కలకలం రేపింది. భయంతో పిల్లలు పరుగులు తీశారు. కాంపౌండ్ వాల్ లేకపోవడం, పక్కనే వ్యవసాయ పొలం ఉండడంతో అక్కడి నుండి తరచూ పాముల సంచరింపుతో పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి ఉపాధ్యాయురాలు వెట్టి ప్రియా, పిల్లల తల్లి, తండ్రులు మాట్లాడుతూ... మా అంగన్వాడి కేంద్రంనికి ప్రహరి గోడ లేకపోవడంతో తరచూ పాములు సంచరిస్తున్నాయని పాములు వచ్చినప్పుడు పిల్లలు భయభ్రాంతులకు గురి అవుతున్నారని,అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారని తెలిపారు..ఒకవేళ జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంపౌండ్ వాల్ నిర్మించాలని కోరారు.