3 July, 2026 | 7:30 PM

కాంగ్రెస్ పాలనలో రైతులకు లాభసాటి

03-07-2026 06:45 PM

* అధిక దిగుబడి పంటలపై దృష్టి సారించాలి 

* మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ 

అచ్చంపేట: కాంగ్రెస్ పాలనలో రైతులకు లాభసాటి జరుగుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమును చెప్పారు. అచ్చంపేట మండలం పలకపల్లిలో నిర్వహించిన మిషన్ ఫర్ కాటన్ ప్రోడక్టివిటీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ విత్తనాలతో రైతులు ఎక్కువ దిగుబడి పొందవచ్చని సూచించారు.  ఇందులో అధిక సాంద్రత,  క్లోజర్ స్పేసింగ్, ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా  విత్తనాలు ఎత్తుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ పద్దతుల ద్వారా అధిక దిగుబడితో పాటు ఒకే సారి కోతకు వస్తుందన్నారు.  కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య, సర్పంచులు  సంతోష్ కుమార్ రెడ్డి, జయప్రకాష్, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.