గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య
24-04-2026 06:07 PM
కోదాడ,(విజయక్రాంతి): గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ మందుల నాగయ్య అన్నారు. గుడిబండ గ్రామంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంలో భాగంగా శుక్రవారం గ్రామ స్వరాజ్యం - ప్రగతి పాలన వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కోదాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి , గ్రామ సెక్రటరి , ఉప సర్పంచ్ ఇర్ల జయసింహా రెడ్డి , వ్యవసాయ అధికారి సల్మా , ఏఎన్ఎం, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గుడిబండ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






