13 August, 2026 | 2:54 AM

జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం

13-08-2026 01:47 AM

ఘనంగా రంగనాథన్ జయంతి 

నాగోల్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): లె క్చరర్స్ కాలనీ డివిజన్ హయత్నగర్ ప్రభు త్వ డిగ్రీ కళాశాల,  గ్రంథాలయ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ గ్రంథపా లకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. ఎస్.ఆర్. రంగనాథన్ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు మాట్లాడు తూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని సూచించారు. అనంతరం గ్రంథపాలకులు డా. ఎ. దుర్గ ప్రసాద్ డా. రంగనాథన్ గ్రంథాలయ రంగానికి చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఇందిరా, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డా. శ్రీపతి నాయుడు, డా. అనిత, ఫిజికల్ డైరెక్టర్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.