వాట్సాప్‌లో MeeSeva సేవలు.. పేపర్‌లెస్ గవర్నెన్స్‌కు పెద్దపీట
ఏఐ ట్రాన్స్ ఫర్మేషన్ కాన్ క్లేవ్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
ఇంటి ముంగిటకే పౌరసేవలు,
పేపర్ లెస్ గవర్నెన్స్ కు పెద్దపీట
20కిపైగా ప్రభుత్వ శాఖలు ఒకే తాటిపైకి తెచ్చేలా ఆర్ టీజీ డ్యాష్ బోర్డు
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) శుక్రవారం నాడు ఏఐ ట్రాన్స్ ఫర్మేషన్ కాన్ క్లేవ్(AI Transformation Conclave) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్, బ్లాక్ చెయిన్ ఆధారిత సర్టిఫికేట్లు సేవలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. టీ- ఫైబర్(T-Fiber)తో 80 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ కనెక్టివిటీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. త్వరలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి ముంగిటకే పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయని సూచించారు. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్(Digital Office Project) ద్వారా పేపర్ లేస్ గవర్నెన్స్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటికల్స్, డిజిటల్ ప్లాట్ ఫామ్ కు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. 20కి పైగా ప్రభుత్వ శాఖలను ఒకే తాటిపైకి తెచ్చేలా ఆర్ టీజీ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
'AI ట్రాన్స్‌ఫార్మేషన్ కాంక్లేవ్'లో పాల్గొన్న అనంతరం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇలా అన్నారు: "సరైన సమయంలో నిర్వహించబడిన కార్యక్రమం ఇది. 'గవర్నమెంట్ కనెక్ట్' (Government Connect) ఆధ్వర్యంలో ఈ 'AI ట్రాన్స్‌ఫార్మేషన్ కాంక్లేవ్' జరిగింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు 'మీ-సేవ' (MeeSeva) ద్వారా తెలంగాణ ప్రభుత్వం గత 30 నెలలుగా చేపడుతున్న చర్యలను ఇక్కడ మేము వివరించే ప్రయత్నం చేశాము. మేము దాదాపు 580 రకాల 'మీ-సేవ' ప్రజా సేవలను వాట్సాప్ (WhatsApp) వేదిక ద్వారా అందిస్తున్నాము. పౌరులకు ఈ విధంగా 580 సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ప్రజల కోసం మేము అమలు చేయాలని భావిస్తున్న 'పౌర-కేంద్రిత పాలన' (citizen-centric governance) ఇదే." అని మీడియాతో అన్నారు.






