1,81,425 మంది పిల్లల గుర్తింపు
ఈ నెల 13 న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్
మెదక్, జులై 10 (విజయక్రాంతి): ఈనెల 13 తారీకున నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలో ఈ కార్యక్రమా నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గణేశ్వర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జూలై 13 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సంధర్భంగా 1-19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంభందించిన ట్రైనింగ్ లను పి.హెచ్.సి.లలో పూర్తి చేశామని, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాఠశాలలు, కళాశాలలలో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవగాహన కల్పిస్తున్నారని, జిల్లాలో 1-19 సంవత్సరాల పిల్లలు 181425 (లక్షా ఎనభై ఒకవేయి నాలుగు వందల ఇరవై ఐదు) వుండగా 236400 (రెండు లక్షల ముప్పు ఆరువేల నాలుగు వందల) అల్బెండజోల్ మాత్రలు సిద్ధంగా ఉంచామని, అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడ మాత్రలను పంపించామని, ఉదయం స్కూల్ లో ప్రార్థన చేసిన తర్వాత పిల్లలకు చేతుల పరిశుభ్రత, అల్బెండజోల్ మాత్రల గురించి తెలియజేయాలన్నారు. ఈ నెల 13వ తేదీన మాత్రలు వేసుకోని పిల్లలకు 20న మాపప్ కార్యక్రమం. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్తలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.






