3 March, 2026 | 5:16 PM

పంట పొలాల్లో నెమలి

03-03-2026 03:41 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అడవుల్లో ఉండాల్సిన నెమలి పంట పొలం లో  ఉండడంతో రైతులు చూసి అవాక్కయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామ శివారులోని ఆనందం  అనే రైతు మంగళవారం పొలం వద్దకు వెళ్లాడు. పొలంలో నెమలి ఉండడాన్ని గమనించాడు. దగ్గరికి వెళ్లిన అక్కడినుంచి కదలలేదు. దీంతో రైతు మరి కొంత మంది రైతుల కు చెప్పాడు. కొంతమంది  రైతులు వచ్చి చూసినప్పటికీ నెమలి అక్కడి నుంచి కదలలేదు.

అనారోగ్య సమస్య ఉండడంతో ఎగర లేకపోతుంప్పటికీ నెమలి అక్కడి నుంచి కదలలేదు. అనారోగ్య సమస్య ఉండడంతో ఎగర లేకపోతుందని గ్రహించి  తాగునీరు, దాన పెట్టారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాము వచ్చేవరకు అక్కడే భద్రపరచాలని రైతులకు సూచించారు. అధికారులు రావడంతో రైతులు నెమలిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. నెమలిని చూడడానికి గ్రామస్తులతో పాటు పలువురు వచ్చి దగ్గర నుంచి చూశారు. తాగునీరు, దాన పెట్టిన రైతులు ఆనందం, రాజు, సునీతలను ఫారెస్ట్ అధికారులుఅభినందించారు.