సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: మార్చి 16న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు(Telangana Budget session) ప్రారంభమయ్యే ముందు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు అర డజను ప్రధాన హామీలు, 420 వాగ్దానాలు చేసిందని, దాని ఆధారంగానే ప్రజలు ఆ పార్టీకి అధికారాన్ని అప్పగించారని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆయన గుర్తు చేసుకున్నారు.
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మీరు ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి.. గెలిచాక రాష్ట్ర ఖజానా ఖాళీ అంటూ తప్పించుకోవడంలో మతలబు ఏంటీ? ఒకవైపు ఖజానాలో నిధులు లేవని చెబుతూనే, కాంగ్రెస్ అధిష్టానం కోసం రూ. 1,000 కోట్లు ఇస్తామనడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం రూ. 12 లక్షల కోట్లకు పైగా నిధులు, ప్రాజెక్టుల రూపంలో సాయం అందిస్తోందని వివరించారు.
మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం, వడ్డీ రహిత రుణాలు (Special Assistance to States for Capital Investment) అందించినా, రాష్ట్రంలో కనీసం చిన్న పనులు కూడా జరగని దుస్థితి నెలకుందని కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. అప్పులు లేకుండా ఒక్క రోజు కూడా పాలన సాగించలేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చింది ఎవరు? 2014లో మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని నేడు అప్పుల ఊబిలోకి నెట్టిన వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.




