పాపన్నపేట కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథ్యం
* మండలాధ్యక్షుడిగా నరేందర్‌గౌడ్
* ప్రధాన కార్యదర్శిగా రమణ
* 21మందితో నూతన కమిటీ ఏర్పాటు
పాపన్నపేట: మండల కాంగ్రెస్ పార్టీలో నూతన కార్యవర్గం కొలువుదీరింది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులను సమన్వయం చేసేందుకు 21మందితో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎస్.అంజనేయులు గౌడ్ గురువారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నరేందర్‌గౌడ్‌ను, ప్రధానకార్యదర్శిగా నిరుడి రమణను నియమించారు. వీరితో పాటుbఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, కార్యదర్శులు, ట్రెజరర్ తదితర బాధ్యతలను పలువురు నాయకులకు అప్పగించారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
నూతన అధ్యక్షుడు నరేందర్‌గౌడ్, ప్రధానకార్యదర్శి నిరుడి రమణ నాయకత్వంలో మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు.
కార్యకర్తల్లో నూతనోత్సాహం
నూతన కమిటీ ప్రకటనతో మండల కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు నరేందర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రమణలు తెలిపారు. నూతన కమిటీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.






