లస్కర్ల మండల కమిటీ ఎన్నిక
20-08-2026 10:04 PM
మోతె,(విజయక్రాంతి): లస్కర్ల మండల కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లస్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు ధరావత్ వంశీ కృష్ణ చెప్పారు. మండలంలోని ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్న లస్కర్లు అందరు ఐక్యంగా ఉండి సమస్యలపై సంఘటితంగా కృషి చేయాలని వంశీ కృష్ణ తెలిపారు. మండల అధ్యక్షులుగా చుండిరి లక్ష్మి నర్సింహా, ఉపాధ్యక్షలుగా ఉప్పునూతల నరేష్, ప్రధాన కార్యదర్శిగా ఉపేందర్, కోశాధికారిగా శివ లను కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.






