20 August, 2026 | 11:18 PM

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

20-08-2026 10:03 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, సాంకేతిక రంగంలో ఆధునికతకు రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సేవలో ముందుకు సాగాలని అన్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్ల సోమయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, పుండ్ర లక్ష్మారెడ్డి, మిట్టపల్లి జీవన్ రెడ్డి, కోటగిరి ఆనంద్ గౌడ్, మరిపెళ్లి మల్లయ్య, బాజోజి సత్యనారాయణ, క్యాతం సురేష్ రెడ్డి, ఎర్ర భూమయ్య, కొప్పెల రవీందర్, సిరిపురం రవీందర్, రోడ్ల రాజారెడ్డి, నూతిపెళ్లి రాజం తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.