17-02-2026 12:00:00 AM
దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్‌గా నిలిచిన ఏకైక విద్యా సంస్థ
హైదరాబాద్, ఫిబ్రవరి 16(విజయక్రాంతి): జేఈఈ 2026 తొలి విడత ఫలితాలను సోమ వారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. యావత్ భారతదేశం నుంచి మరి ఏ ఇతర విద్యా సంస్థ సాధించటువంటి అరుదైన ఘనతను నారాయణ తన పేరు న లిఖించుకుంది. ముగ్గురు నారాయణ వి ద్యార్థులు 100 పర్సంటైల్ సాధించటంతో పాటు 5 రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా) స్టేట్ టాపర్స్‌గా నిలిచారు.
వివన్ శరత్ మహేశ్వరి, మాధవ్ విరాడియా, నరేంద్రబాబు గారి మహిత్‌లు పర్సంటైల్ సాధించి దేశంలోనే టాపర్లుగా నిలిచారు. వీరితో పాటు కర్ణాటకు చెందిన విష్ణుసాయి తేజ 99.999 పర్సంటైల్, గోవాకు చెందిన తనయ్ అజిత్ ప్రభు 99.825 పర్సంటైల్‌తో ఆయా రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచారని నారాయణ విద్యా సంస్థల డైరె క్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ పేర్కొన్నారు.
మరో డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ నారాయణ ఇన్ లెర్నింగ్ యాప్ ఎన్ ద్వారా విద్యార్థులు తమ ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తు న్నారన్నారు. ఈ అద్భుత విజయంపై నారాయణ విద్యా సంస్థల కోర్ మేనేజ్‌మెంట్ కమి టీ పి.రమాదేవి హర్షం వ్యక్తం చేశారు.