calender_icon.png 17 February, 2026 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌన్సిలర్లు మళ్లీ గెలిచేలా పనిచేయాలి

17-02-2026 12:00:00 AM

కోదాడ, ఫిబ్రవరి 16: ప్రస్తుతం కౌన్సిలర్లుగా గెలిచిన అభ్యర్థులు మచ్చ తెచ్చుకోకుండా పనిచేసి మళ్లీ మళ్లీ గెలిచేలా పనిచేయాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ , వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా స్థానిక ఎమ్మెల్యేగా పాల్గొని అనంతరం విలేఖర్లతో మాట్లాడారు.

కోదాడ పట్టణ అభివృద్ధే  లక్ష్యంగా నూతన కోదాడ పురపాలక సంఘం పాలకవర్గం పని చేయాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో కోదాడ పట్టణానికి భారీ ఎత్తున నిధులు మంజూరు చేయిస్తానని నిజాయితీగా పనిచేసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. పాలకవర్గం సమన్వయంతో పట్టణ అభివృద్ధికి పనిచేయాలని సూచించారు.

నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి కౌన్సిలర్లను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్స్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, సీనియర్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు,ముత్త వరపూ పాండురంగారావు, అల్తాఫ్ హుస్సేన్, బషీర్,చింతల పాటి శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.