2 July, 2026 | 2:58 AM

పేద విద్యార్థులకు ‘నందమూరి జానకిరామ్ ట్రస్ట్’ చేయూత

02-07-2026 01:54 AM

శంకర్‌పల్లి, జూలై 1 (విజయక్రాంతి): పేద విద్యార్థులను ఆదుకోవడమే లక్ష్యంగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్ పనిచేస్తోందని ట్రస్ట్ ఛైర్మన్ దీపిక జానకిరామ్ అన్నారు. బుధవారం కొండకల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు, పెన్నులు, మరియు స్టడీ మెటీరియల్స్ను ఆమె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దీపిక జానకిరామ్ మాట్లాడుతూ... కీర్తిశేషులు నందమూరి జానకిరామ్ స్మారకార్థం ఈ ట్రస్టును ఏర్పాటు చేశామన్నారు.

బాలికల విద్యను ప్రోత్సహించడం, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం, దివ్యాంగులకు మరియు పేద కుటుంబాలకు చేయూతనివ్వడమే ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నందమూరి కుటుంబ ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండాకల్ గ్రామ సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.