2 July, 2026 | 3:00 AM

భూతగాదాలు, మూడనమ్మకాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు

02-07-2026 01:53 AM

హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ చరమందరాజు

గరిడేపల్లి, జూలై 1: భూ తగాదాలు మూఢనమ్మకాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.చరమందరాజు అన్నారు.ఎస్పీ ఆదేశాల మేరకు గరిడేపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని పొనుగోడు గ్రామంలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సామాజిక అంశాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో యువత, పౌరులు స త్ప్రవర్తనతో నడుచుకోవాలన్నారు. శాస్త్ర సాంకేతికతతో సమాజం అభివృద్ధి చెంది ముందుకు వెళుతున్నదని బాణామతి, మంత్రాలు, తంత్రాలు లాంటివి ఏమీ లేవన్నారు.

వ్యవసాయ సీజన్ ప్రారంభమైన వ్యవసాయ భూముల గట్ల తగాదాలు స్థల వివాదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తగాదాలు పెట్టుకుంటూ భౌతిక దాడులకు పాల్పతే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో గతంలో జరిగిన భూ పంచాయితీలో నలుగురికి జీవిత ఖైదు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటకం వేణు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.