27 July, 2026 | 12:56 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

జాబ్ కార్డులో నూతనంగా యువతీ, యువకుల పేర్లు నమోదు చేయాలి: జోగు అరవిందరెడ్డి

03-06-2026 07:55 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన గ్రామీణ యువతీ, యువకులను జాబ్ కార్డు ల్లో పేర్లు నమోదు చేయాలని ఉప సర్పంచ్ జోగు అరవిందరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో  ఆయన విలేకరులతో మాట్లాడుతూ. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ప్రతి కుటుంబంలో ఉన్నారని, వారందరినీ జాబ్ కార్డుల్లో చేర్పించి, కొత్త వారికి ప్రభుత్వం జాబ్ కార్డు మంజూరు చేయాలని కోరారు. దీని ద్వారా యువతీ, యువకులకు ఆర్థిక సంవత్సరంలో హామీ తో కూడిన వేతన ఉపాధి లభిస్తుంది.

జాబ్ కార్డు కొరకు18 ఏళ్ళు నిండిన గ్రామీణ ప్రాంతంలో నివసించే పౌరులు ఎవరైనా దీనికి అర్హులన్నారు.జాబ్ కార్డు కొరకు 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో జాబ్ కార్డు జారీ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో, ఏ పీ ఓకు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫ్యామిలీ జాబ్ కార్డ్ జీరాక్స్, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాల్సి ఉంటుంది.

ఈ జాబ్ కార్డు వివరాలను ఆన్లైన్లో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నేడు గ్రామాల్లో జాబ్ కార్డు తల్లిదండ్రులుమాత్రమే ఉండి 18 సంవత్సరాలు నిండిన పిల్లలు జాబ్ కార్డ్ ఎక్కించే పరిస్థితి కనిపించడం లేదని, ఈ విషయంపై వివరాలు అడిగితే గ్రామాల్లో సరైన సమాధానం ఇచ్చేవారు లేక, చాలా మంది ఉపాధి హామీ పనికి దూరంగా ఉండడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే జాబ్ కార్డులో పేర్ల నమోదు కోసం గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించి అర్హులైన వారందరినీ జాబ్ కార్డులలో పేర్లు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.