calender_icon.png 22 February, 2026 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి నాయకులను అరెస్టు చేసిన నాగిరెడ్డిపేట్ పోలీసులు

22-02-2026 07:09:22 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణరెడ్డిపై కాంగ్రెస్ నాయకులు జరిపినటువంటి దాడిలో భాగంగా ఎమ్మెల్యేను పరామర్శించడానికి అలాగే బాన్సువాడలో ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో గాయాలపాలైన హిందూ సంఘాల నాయకులను పరామర్శించడానికి వెళ్తున్న రాష్ట్ర బిజెపి నాయకులు వరంగల్ జిల్లా ఇన్చార్జి మురళీధర్ గౌడ్ను నాగిరెడ్డిపేట్ మండల పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగిందనీ మండల బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాజమోహన్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమాన్లు,మండల ఉపాధ్యక్షులు ఈశ్వర్ గౌడ్, నాయకులు అంజయ్య,రాజ గంగాధర్,నరేందర్ రెడ్డి ఉన్నారు.