26 May, 2026 | 10:48 AM

లింగాపూర్ గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు

26-05-2026 10:23 AM
  1. 25 లీటర్ల గుడుంబా పట్టివేత...
  2. 1200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
  3. ఇంటింటా సోదాలు

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం లింగాపూర్ గ్రామన్ని పోలీసులు చుట్టు ముట్టి సోదాలు చేశారు. మంగళవారం  తెల్లవారుజామున పోలీసులు లింగాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ పేరిట వందల మంది పోలీసులు ప్రవేశించారు. ఇంటింటా సోదాలు చేశారు. పోలీసుల సోదాలు గ్రామాలను భయపింకితులను చేశాయి.  భూక్య రంజిత్, నివాసంలో  అక్రమంగా కలిగి ఉన్న 20 లీటర్ల గుడుంబాను,  బానోత్ వాగేష్, నివాసంలో    05 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1200 లీటర్ల గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం పానకం  ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఇళ్లలో ఉన్న  30 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు  4 ట్రాలీల వాహన పత్రాలను తనిఖీ చేసి, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.

గుడుంబా తయారీ అక్రమ నిల్వలు చట్టవ్యతిరేకం..

బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్  మాట్లాడుతూ గుడుంబా తయారీ, నిల్వ విక్రయం చట్టవిరుద్ధమన్నారు. గుడుంబా సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వివరించారు. ఎవరైనా గుడుంబా తయారు చేసినా, నిల్వ ఉంచినా లేదా విక్రయించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం, ట్రాఫిక్ నియమాలు  హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు. పోలీస్ కమ్యూనిటీ  కాంట్రాక్టు లో బెల్లంపల్లి 2 టౌన్ ఎస్‌.ఐ కిరణ్, తాళ్ళగురిజాల ఎస్‌ఐ రామకృష్ణ, ఏఎస్ఐ లు అలీ, తిరుపతి  బెల్లంపల్లి రూరల్ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.