calender_icon.png 22 February, 2026 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ హమాలి మేస్త్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి

22-02-2026 07:12:21 PM

- సిపిఐ, ఏఐటీయూసీ నేతల ఘన నివాళులు

అశ్వాపురం,(విజయక్రాంతి): మొండికుంట గ్రామానికి చెందిన సీనియర్ హమాలి మేస్త్రీ సామకూరి శంకరయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందడం బాధాకరమని సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. మండలంలో హమాలి కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, ఎంతోమందిని మేస్త్రిలుగా తీర్చిదిద్దిన వ్యక్తిగా సామకూరి శంకరయ్య ప్రత్యేక గుర్తింపు పొందారని వారు తెలిపారు. కార్మిక వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఆదివారం ఉదయం సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వర్లు, మొండికుంట బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సర్వకృష్ణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.