సూర్యాపేట జిల్లా సోలిపేటలో వ్యక్తి దారుణ హత్య
26-05-2026 09:29 AM
సూర్యాపేట,(విజయక్రాంతి): వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) లోని సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మేకల జయరాములు (50) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు.
అయితే ఈ హత్య భూవివాదాల కారణంగానే జరిగినట్టు తెలుస్తుంది. కాగా హత్యకు సంబంధించిన వ్యక్తులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట పరిధిలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఇదే మండలంలోని యార్కారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడి హత్య జరిగి మూడు రోజులు గడపక ముందే మరో హత్య జరగడంతో మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






