26 May, 2026 | 10:39 AM

సిద్దిపేటలో బాడీ బిల్డింగ్ పోటీలు

26-05-2026 09:47 AM

ఆసిఫ్‌కు టైటిల్‌.. అపెక్స్ జిమ్‌కు ప్రశంసలు..

సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచీ కళావేదికలో నిర్వహించిన ఎక్స్ట్రీమ్ క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్‌పోలో భాగంగా బాడీ బిల్డింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. కార్యక్రమానికి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని పలు జిమ్‌లకు చెందిన యువకులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విక్టరీ కేఫ్ పైన ఉన్న అపెక్స్ జిమ్‌లో శిక్షణ పొందుతున్న ఆసిఫ్ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ తన విజయానికి అపెక్స్ జిమ్ మిత్రబృందం, ట్రైనర్ల సహకారం ఎంతో దోహదపడిందన్నారు. కార్యక్రమానికి సుమారు 50 మందికి పైగా హాజరుకాగా, సిద్దిపేట పట్టణంలోని జిమ్ నిర్వాహకులు, ఫిట్‌నెస్ అభిమానులు పాల్గొన్నారు.