ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ మైలవ్
జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మై లవ్’. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో హీరోగా సంజోష్ తగరం, హీరోయిన్‌గా రిషిత నటిస్తుండగా తనికెళ్ల భరణి, ‘పుష్ప’ కేశవ, రచ్చ రవి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, మురళీధర్‌గౌడ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ తాజాగా విడుదలైంది.
జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ సంజోష్ తగరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఇదే వేదికపై ‘జోష్ ఎంఆర్‌ఎస్ హైదరాబాద్ అవార్ట్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘మై లవ్’ మూవీ హీరో సంజోష్ తగరం మాట్లాడుతూ.. “ప్రేమించిన అమ్మాయిని గుర్తుకు తెచ్చే సినిమా ‘మై లవ్’. ఇదొక ఫీల్ గుడ్ సినిమా. లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ డివోషనల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాం” అని తెలిపారు. ముఖ్య అతిథిగా వచ్చిన ‘పుష్ప’ ఫేమ్ కేశవ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను ఒక మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నా. కథ చాలా బాగుంది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌ను డైరెక్టర్ తీసుకున్నారు. ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది” అన్నారు. ‘ఈ సినిమా హిట్ కన్‌ఫర్మ్’ అని మరో ముఖ్యఅతిథి హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం చెప్పారు.






