నా వ్యాఖ్యలను వక్రీకరించారు
- సింగరేణిలో స్కాములు తప్ప స్కీములు లేవు
- ప్రజల దృష్టి మరల్చేందుకే చీప్ ట్రిక్
- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): సింగరేణి కార్మిక సంఘం మీటింగ్‌లో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మా యం అయిందని హరీశ్‌రావు చెప్పారని, ఆయన వ్యాఖ్యలపై ప్రజల దృష్టి మరల్చడానికి తన మాటలను బయట పెట్టారని తెలిపారు. ‘నాపైన కేసు పెట్టాలని డీజీపీకి ఫిర్యాదు చేశారని, కానీ నాపైన పెట్టే దృష్టి సింగరేణిపై పెట్టాలని’ హితవు పలికారు. సింగరేణి సంస్థను సీఎం బామ్మర్దికి అప్పగించారని ఆరోపించారు. ‘టీబీజీకేఎస్‌కు పూర్వవైభవం రావాలంటే ము చ్చట్లు పెట్టుడు, మీటింగ్‌లు పెట్టుడు కాదు.. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. మందమర్రి ఏరియాలో ప్రోగ్రాం పెట్టండి.
జీఎం ఆఫీసు కాల బెడదాం. పోతే పోతాం ఒక నెల రోజులు జైలు కు. మన కొట్లాట చూసి కార్మికులు మనల్ని ఓన్ చేసుకోవాలి. అందుకే మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాలి. రైల్‌రోకో పెట్టి రైల్ లైన్లు అన్నీ కోసి పారేయాలి. నెల రోజులో 45 రో జులో జైలు పోయి రండి. అవసరమైతే సింగరేణి భవన్‌కు వచ్చి కాలబెట్టండి. అంగడి అంగడి చేయండి. అట్లుతైనే కార్మిక లోకం మన వైపు వస్తారు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై దుమారం లేవడంతో బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో బాల్క సుమన్ స్పందించారు.
సీఎం కార్యాలయం డైరెక్షన్ మేరకు తనను ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు.ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పేల్చాలని పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడారని, నిజంగా కేసులు పెట్టాలంటే సీఎంతో సహా అందరిపై కేసులు పెట్టాలన్నారు. సింగరేణి ఏరియాకు, రైతుల కొనుగోలు కేంద్రానికి వెళ్దామా అని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్ చేశారు. శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో ప్ర జలు తిరగబడునట్టు తెలంగాణలోను తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. సీఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించే లోగా రైతుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్‌లో గెల్లు శ్రీనివాస్ యాద వ్, పల్లె రవికుమార్, కురువ విజయ్‌కుమార్, తుంగ బాలు, పడాల సతీష్ రాజేష్, రవీందర్‌రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.






