22 July, 2026 | 2:40 PM

బాధితుడికి నగదు అప్పగింత

22-07-2026 01:57 PM

గోవిందరావుపేట (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదం సందర్భంగా ద్విచక్ర వాహనదారుడు పోగొట్టుకున్న నగదు ను గుర్తించిన పసర ఎస్ ఐ తాజుద్దీన్, కానిస్టేబుల్ మధుకర్ బాధితునికి అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. కన్నాయిగూడెం గ్రామానికి చెందిన సోయం వీరబాబు అనే వ్యక్తి రెండు రోజుల క్రితం గోవిందరావుపేటకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ సంఘటనలో గాయపడ్డ అతన్ని వెంటనే 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటనస్థలిలో బాధితుడికి చెందిన 9,700 రూపాయలు అక్కడ పడిపోయిన విషయాన్ని పోలీసులు గుర్తించి, ఆ డబ్బును బుధవారం బాధితుడికి అప్పగించారు. శాంతి భద్రతలను కాపాడడంతోపాటు నిజాయితీగా తమకు దొరికిన డబ్బును బాధితుడికి అందించడం పట్ల పలువును పోలీసులకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.