కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. బండి సంజయ్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ యత్నం
కరీంనగర్: తెలంగాణ రాజకీయాలు(Telangana Politics) రసవత్తరంగా మారాయి. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు ఇళ్లు, కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించారు. కరీంనగర్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ గాంధీ విగ్రహం(Karimnagar Gandhi Statue) ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయంపై రాళ్లు, చెప్పులతో, బీజేపీ కార్యకర్తలపై కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు ప్రతిదాడికి దిగారు.
రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్(Police arrest Congress activists) చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న సీపీ గౌస్ ఆలం పరిస్థితిని సమీక్షించారు. కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipalli Satyam) నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు కరీంనగర్ లో బండిసంజయ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే సంత్యంతో పాటు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






