31 August, 2026 | 7:20 PM

అంధత్వాన్ని నివారించాలి: అదనపు కలెక్టర్ విక్టర్

31-08-2026 06:04 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి కలెక్టరేట్లో ఉచిత నేత్ర పరీక్ష శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సోమవారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ  ఆదేశాల మేరకు కంటి దానంపై ప్రజల్లో అవగాహన పెంచడం, స్వచ్ఛంద నేత్రదాన ప్రతిజ్ఞలను ప్రోత్సహించడం, కార్నియల్, దానానికి సంబంధించిన అపోహలను, మూఢనమ్మకాలను తొలగించే లక్ష్యంతో 25 ఆగస్టు నుండి 8 సెప్టెంబర్ 2026 వరకు తెలంగాణ వ్యాప్తంగా 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది కలెక్టరేట్ ‌కు వచ్చే సాధారణ ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తగిన సలహాలు, సూచనలు అందించారు. ఈ శిబిరం లో ‌‌‌‌‌‌‌‌‌‌‌ 175  మందికి కంటి పరీక్షలు చేశారు. 113  మందికి కంటి అద్దాలు పంపిణి చేశారు.