సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి
31-08-2026 06:27 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్(Additional Collector Victor) అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన విముక్తి జాతుల దినోత్సవ(Denotified tribes liberation day) కార్యక్రమంలో జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంచర జాతులు, విముఖ జాతులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి సమస్యలను సంఘ ప్రతినిధులు వివరించి, వాటి అభివృద్ధికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.






