22 July, 2026 | 2:53 AM

సింధు హాస్పిటల్‌ను సందర్శించిన మురళీమోహన్

21-07-2026 01:07 AM

అత్యాధునిక వైద్యం, సామాజిక సేవపై ప్రశంసలు

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ మురళీమోహన్ హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్స్‌ను సందర్శించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల ను పరిశీలించి, ఆస్పత్రి అందిస్తున్న సేవలను అభినందించారు.

క్యాన్సర్ చికిత్సతో పాటు 30కి పైగా మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒకేచోట అందించడం అభినందనీయమని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, వారి సహాయకుల కోసం ఏర్పాటు చేసిన నివాస సౌకర్యం ’బిండి’స్ ఆశ్రయ్’ గురించి తెలుసుకొని ప్రత్యేకం గా ప్రశంసించారు. ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న రోగులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు