15 June, 2026 | 2:24 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభావాలకు తావు లేదు

04-02-2026 12:11 AM

ఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు 

మున్సిపల్ సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ 

మెదక్, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలకు తావు లేదని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకు రవి కిరణ్ అన్నా రు. మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను పరిశీలించారు.

ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మా ట్లాడుతూ.. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎన్నిక జరగాలని, ఎవరైనా బలవంతంగా ప్రలోభాలు చేసిన, బెదిరించి న, చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. ఎన్నికల సంఘం నియమాలను అనుసరించే గుర్తుల కేటాయింపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.